
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రామ్‌చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. జూన్ 20వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీకి ఒకరోజు ముందు నుంచి ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. ఉపాసనతో పాటు బేబీ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ఇదివరకే వెల్లడించారు. దీంతో శుక్రవారం(జూన్ 23న) ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'జూన్ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళుతున్నాం. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులు చేసిన ప్రార్థనలు కూడా మర్చిపోలేను. మీ ఆశీస్సులు పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకర సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. సాంప్రదాయం ప్రకారం 13వ రోజు లేదా 21వ రోజున ఆ పేరు వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment