Ram Charan Wife Upasana Shares Pic with Baby Girl - Sakshi

Upasana: మా చిన్నితల్లికి ఘనస్వాగతం.. అందరికీ థ్యాంక్స్‌..

Jun 24 2023 8:44 PM | Updated on Jun 24 2023 9:01 PM

Ram Charan Wife Upasana Shares Pic with Baby Girl - Sakshi

ఉపాసన తన కూతురిని ఎత్తుకోగా చరణ్‌ తన పెంపుడు కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. మా చిట్టితల్లికి లభించిన ఘనస్వాగతం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది

మెగాప్రిన్సెస్‌ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. దశాబ్ద కాలం ఎదురుచూపులకు తెరదించుతూ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన జూన్‌ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో జూన్‌ 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. చిన్నారి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటే సెలబ్రేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందేగా! చిరంజీవి ఇంటిని పువ్వులు, బెలూన్లతో అలంకరించారు. వెల్‌కమ్‌ హోమ్‌ బేబీ అంటూ పాపాయికి ఘన స్వాగతం పలికారు.

తాజాగా తన బుజ్జి పాపాయిని ఎత్తుకున్న ఫోటోను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో ఉపాసన తన కూతురిని ఎత్తుకోగా చరణ్‌ తన పెంపుడు కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. మా చిట్టితల్లికి లభించిన ఘనస్వాగతం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. మాపై ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఇన్‌స్టాగ్రామ్‌ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: పెళ్లిపీటలెక్కిన జిల్‌ విలన్‌, ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement