సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. తనకు నచ్చినట్లు ఇష్టారీతిన సినిమాలు తీసుకుంటూ పోతున్నాడీ డైరెక్టర్. సినిమాలు చూస్తారా? లేదా? అనేది జనాల ఇష్టం అంటూనే జయాపజయాలను లెక్క చేయకుండా వరుసపెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. తరచూ బయోపిక్‌ల మీద దృష్టి సారిస్తూ వచ్చిన ఆర్జీవీ తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లడ్కీ సినిమా తీశాడు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్న ఈ మూవీ తమిళ వెర్షన్‌కు పొన్ను, తెలుగు వర్షన్‌కు అమ్మాయి అన్న పేర్లను ఖరారు చేశారు. ఇందులూ పూజా భలేకర్ కథానాయిక.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది శ్యామల. మార్షల్ ఆర్ట్స్ బేస్‌డ్ మూవీ కాబట్టి ఓ గేమ్ ఆడదామని అడిగింది. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏంటో కరెక్ట్‌గా గెస్ చేయాలంది. దీనికి వర్మ ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
చంపూ రశీదు సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటో చెప్పమని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది. దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్ బిల్ అని ఆన్సరిస్తూ నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది.
చదవండి: నా దగ్గర డబ్బుల్లేని సమయంలో ఆయనే నీడనిచ్చారు
డాక్టర్.. పోలీస్ అయితే..? 'ది వారియర్' సినిమా రివ్యూ..
Comments
Please login to add a commentAdd a comment