దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సబంధించిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ‘వ్యూహం’లో ఏం చూపించబోతున్నారు? సినిమా ఎలా ఉంటుంది? అనే ఆసక్తి సినీ ప్రియులతో పాటు రాజకీయ నాయకుల్లోనూ పెరిగింది.
(చదవండి: ఆర్జీవీ డెన్ వారి కోసమే)
తాజాగా తాను తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ స్టోరీ ఏంటో ఆర్జీవీ వెల్లడించాడు. సీఎం జగన్‌గారి జీవితంలో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది వ్యూహం తొలి భాగంలో చూపించబోతున్నారట. అలాగే 2015 నుంచి 2023 వరకు జగన్‌గారి జీవితంలోని అంశాల నేపథ్యంలో ‘వ్యూహం 2’ ని తెరకెక్కించబోతున్నట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. వ్యూహం 1ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో, వ్యూహం 2ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని వెల్లడించాడు.
ఇక సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. ‘వ్యక్తగతంగా సీఎం జగన్‌గారి వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. మాట ఇస్తే దానికోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటారాయన. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జగన్‌గారిని తొక్కేయాలని కొందరు కుట్రలు పన్నారు. వాటిని కూడా నా సినిమాలో చూపిస్తాను’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment