రానా వల్లే సమంతకు ఆ క్రేజీ ఆఫర్‌ వచ్చిందట! | Is Rana Daggubati Reason For Samantha Gets The Arrangement Of Love Movie Offer | Sakshi
Sakshi News home page

Samantha And Rana: సామ్‌కు ఆ క్రేజీ ఆఫర్‌ రావడానికి రానానే కారణమట!

Published Wed, Dec 1 2021 9:13 PM | Last Updated on Wed, Dec 1 2021 10:23 PM

Is Rana Daggubati Reason For Samantha Gets The Arrangement Of Love Movie Offer - Sakshi

Rana Helps To Samantha For Get A International Film The Arrangement Of Love: స్టార్‌ హీరోయిన్‌ సమంత తొలిసారిగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత  బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. ‘డోంటన్ అబ్బే’ఫేమ్‌ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 

చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు సోదరి ప్రియదర్శిని

కాగా సమంత ఈ మూవీపై ప్రకటన ఇస్తూ.. ‘ఈ సినిమా ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా, షూటింగ్‌ ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ షేర్‌ చేసింది. అయితే ఈ క్రేజీ ఆఫర్‌ సామ్‌కి ఎలా వరించిందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యారు. దీనిపై ఆరా తీయగా ఈ చాలెంజింగ్‌ రోల్‌కు ఎవరూ అయితే సరిపోతారని నిర్మాతలు ఆలోచిస్తుండగా సామ్‌ పేరు ప్రతిపాదించాడట ఓ స్టార్‌ హీరో. ఆ హీర ఎవరో కాదు దగ్గుబాటి వారసుడు, సమంతకు ఒకప్పుడు బంధువు అయిన రానా అని వినికిడి. బై-సెక్సువల్‌ అమ్మాయిగా కనిపించే ఆ పాత్రకు సమంత అయితే న్యాయం చేస్తుందని మేకర్స్‌కు రానా సలహా ఇచ్చాడట.

చదవండి: సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా?

అంతేగాక సామ్‌కు ఒకసారి ఈ కథను తనకు వినిపంచమని రానా మేకర్స్‌ను పట్టుబట్టినట్లు ఫిలిం దూనియాలో గుసగుసల వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కచ్చితమైన క్లారిటీ లేదు. ఇది కొంత సృష్టించిన రూమర్లు అని కూడా పలువురు ఈ వార్తను కొట్టిపారెస్తున్నారు.  భారత రచయిత తిమేరి ఎన్‌ మురారీ రచించిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా ఈ చిత్రం  తెరకెక్కనుంది.  గురు ఫిల్మ్స్‌ పతాకంపై సునీత తాటి నిర్మిస్తుండగా.. ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే  ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రం ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ రోల్స్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్న సామ్‌ మరోసారి అలాంటి వివాదాస్పద పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement