కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్ కపూర్ సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలు త్వరలో రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచాడీ హీరో. ఈ క్రమంలో తన మొదటి భార్య ఆలియా కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నిజంగా ఓ సంఘటన నాకు చాలా క్రేజీగా అనిపించింది. గతంలో నేను మా పేరెంట్స్‌తో కలిసి కృష్ణరాజ్ బంగ్లాలో ఉండేవాడిని. అప్పుడో అమ్మాయి వచ్చి మా ఇంటి గేట్‌ను పెళ్లాడింది. నేను ఇంటికి రాగానే మా వాచ్‌మెన్ ఈ విషయం చెప్పాడు. గేటుకు పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు చల్లి.. ఇక నాకూ తనకు పెళ్లయిపోయినట్లేనని సంతోషించి అక్కడినుంచి వెళ్లిపోయిందట. కానీ నా మొదటి భార్యను నేనింకా కలవాల్సి ఉంది' అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మరి దీనిపై ఆలియా ఏమంటుందో చూడాలి. ఇకపోతే ఆలియా కెరీర్ ప్రారంభంలోనే రణ్‌బీర్ అంటే క్రష్ అని చెప్పింది. అంతేకాదు, అతడితో లవ్ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. తను అన్నట్లుగానే అతడి ప్రేమ పొందడమే కాకుండా ఏకంగా రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకుంది.
చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్
సొంత అన్న పెళ్లికి నాగశౌర్య డుమ్మా!
Comments
Please login to add a commentAdd a comment