Rashmi Gautam Shares A Cow Video Said It Is Even More Worse Than India - Sakshi
Sakshi News home page

Rashmi Gautam: ఇండియాలో ఇది పరిస్థితి, ఓసారి ఆలోచించండి

Published Tue, Jun 21 2022 8:39 PM | Last Updated on Wed, Jun 22 2022 8:54 AM

Rashmi Gautam Shares a Cow Video Said It Is Even More Worse Than India - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్‌ బిజీ అయింది. కెరీర్‌ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది.

హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ.

‘ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. కొందరూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు రష్మీకి మద్దతుగా స్పందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement