Rashmika Mandanna Glamorous Photoshoot At Maldives, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక అందుకే గ్లామర్‌ షో చేస్తుందా? 

Published Sun, Oct 16 2022 8:25 AM | Last Updated on Sun, Oct 16 2022 11:50 AM

Rashmika Mandanna Glamorous Photoshoot At Maldives Viral - Sakshi

తమిళసినిమా: నటి రష్మిక మందన్నాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కిరాక్‌ చిత్రంతో మాతృభాషలో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి వెంటనే టాలీవుడ్‌ నుంచి పిలుపు రావడం, అక్కడ తొలి చిత్రంతోనే సినీ వర్గాల దృష్టిని తన వైపు తిప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక రెండవ చిత్రం గీత గోవిందం రష్మికకు ఏకంగా స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. మధ్యలో కొన్ని చిత్రాలు చేసినా పుష్ప చిత్రం ఈ బ్యూటీని బాలీవుడ్‌ రేంజ్‌కి తీసుకెళ్లిపోయింది.

అలా తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తూ టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న రష్మిక నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లాలని చూస్తుందా? ఆమె తదుపరి గురి హాలీవుడ్‌ పైనా? ఇలాంటి చర్చే ఇప్పుడు హాట్‌ హాట్‌గా దిగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పుష్ప చిత్రం వరకు ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం గుడ్‌ బై వరకు రష్మిక పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే కాపాడుకుంటూ వచ్చింది.

అయితే బాలీవుడ్‌ ప్రభావం ఈ అమ్మడి మీద బాగానే పడినట్లుంది. ఇటీవల ఒక మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం రష్మికకు స్పెషల్‌ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ గ్లామరస్‌ ఫొటోలను చూసి నెటిజన్లు రషి్మకను ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో వారీసు చిత్రంలో విజయ్‌తో రొమాన్స్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement