Rashmika Mandanna Interesting Comments On Her Latest Controversy - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: కన్నడలో రష్మికపై బ్యాన్‌! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే..

Published Tue, Dec 6 2022 9:52 AM | Last Updated on Tue, Dec 6 2022 10:47 AM

Rashmika Mandanna Interesting Comments on Her Latest Controversy - Sakshi

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్‌ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్‌ మీడియాతో తన ఫస్ట్‌ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్‌ ఈ వివాదానికి కారణమయ్యాయి. అప్పటి నుంచి రష్మిక ఎక్కువగా వారత్లలో నిలుస్తోంది. టాలీవుడ్‌లో అగ్ర హిరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ కన్నడ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

అక్కడ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన తొలి చిత్రం గుడ్‌ ఇటివల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆ రెండు చిత్రాల విజయాలపైనే అక్కడ ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. టాలీవుడ్‌లో పుష్ప 2 చిత్రం ఒకటే రష్మిక చేతులో ఉంది. ఇకపోతే కోలీవుడ్‌లో విజయ్‌తో కలిసి చేస్తున్న వారిసు చిత్రంపై ఈ బ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది. కోలీవుడ్‌లో ఈ చిత్రం విజయం రష్మికకు చాలా అవసరం. కాగా మాతృభాషలో ఇప్పుడు ఈమెకు అవకాశాలు వచ్చే చాన్స్‌ లేదు. తన ప్రవర్తనతో శాండిల్‌వుడ్‌ ఆమెపై గుర్రుగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏ విషయంలోనైనా తన మనోభావాలను అంత త్వరగా వ్యక్తం చేయలేనని చెప్పింది. షూటింగ్‌ స్పాట్‌లో జరిగే ఏ సంఘటనపైనా  తాను స్పందించనని చెప్పింది. ఎందుకంటే షూటింగ్‌ సెట్‌లో చాలా మంది తనతో సన్నిహితంగా ఉంటారని, వారిలో ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని పేర్కొంది. అయితే ఈ విషయంలో తన స్నేహితులు కూడా తననే తప్పుబడతారని.. కళ్ల ముందు జరుగుతున్న సంఘటనపై స్పందించాలని వారు చెబుతుంటారని పేర్కొంది. కాగా ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలపై రష్మిక స్పందించకపోవడం గమనార్హం.   

చదవండి: 
బిగ్‌బాస్‌ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్‌! 13 వారాలకు ఎంతంటే?
మధ్యలో ఆగిపోయిన స్టార్ హీరో సినిమా.. కారణం అదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement