రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట!‌ | Ravi Teja New Film Gets Launch On Ugadi 2021 | Sakshi
Sakshi News home page

రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట!‌

Published Mon, Mar 22 2021 9:10 AM | Last Updated on Mon, Mar 22 2021 11:52 AM

Ravi Teja New Film Gets Launch On Ugadi 2021 - Sakshi

రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా ‘నేను లోకల్‌’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ను మాత్రం మే రెండో వారంలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారట.

స్క్రిప్ట్‌ పరంగా ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో చాన్స్‌ ఉందని, ఇందులో శ్రీలీల, లవ్లీ సింగ్, ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా కోసం ఇటలీలో ఉన్నారు రవితేజ. ఇందులోనూ రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది మే 28న ఈ చిత్రం విడుదల కానుంది. 

చదవండి: నాకు గుర్తొచ్చేది ఆ ఇద్దరే: జూనియర్‌ ఎన్టీఆర్‌

శర్వానంద్‌ సినిమా బాగున్నా కలెక్షన్లు రావట్లే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement