![Raviteja, Anita Shinde Star In Dil To Pagal Hai Movie - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/27/anitha-shinde.jpg.webp?itok=vQ-IT9HF)
Dil To Pagal Hai Telugu Movie: 'శ్యామ్ సింగరాయ్’ ఫేమ్ రవితేజ్ హీరోగా, మిస్ మహారాష్ట్ర అనిత షిండే జంటగా సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్‌ఎమ్‌ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పణలో గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్. సోమరాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జైపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత ప్రసన్న కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘జనవరి 15 తర్వాత మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.. మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు సతీష్. ‘‘దిల్ తో పాగల్ హై’ విడుదల తర్వాత ఆరునెలలకో సినిమా నిర్మిస్తా’’ అన్నారు సోమరాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి’’ అన్నారు రవి.
Comments
Please login to add a commentAdd a comment