
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మిస్తున్నారు. యంగ్ హీరో హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలె విడుదలై థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా మ్యూజిక్, ప్రోమో కంటెంట్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.కాగా ఈ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రోమో ఎడిటర్‌గా పనిచేసిన ప్రవీణ్ ఆంటోనీ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధత్యలు తీసుకున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment