Rhea Chakraborty Offered For Bigg Boss 15: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది నటి రియా చక్రవర్తి. సుశాంత్ మరణానికి రియానే కారణం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటారు. బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది. అనంతరం బెయిల్‌పై విడుదలైన రియా ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే..
ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా త్వరలోనే హిందీ బిగ్‌బాస్ సీజన్15 ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు రియాను సంప్రదించారట. ఇందుకోసం ఆమెకు వారానికి రూ.35లక్షల రూపాయలు అంటే కేవలం ఒక్క రోజుకే రూ. 5లక్షల రూపాయలను ఆఫర్ చేశారట షో నిర్వాహకులు.
సుశాంత్ మరణంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రియా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే టీఆర్పీ రేటింగులో ఓ రేంజ్‌లో ఉంటాయని, ఇందుకోసమే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు బీటౌన్ టాక్. అయితే ఇప్పటికే సుశాంత్ మృతితో అప్రతిష్ట మూటగట్టుకున్న రియా బిగ్‌బాస్‌లోకి వెళ్లే ధైర్యం చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment