యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. సినిమాలో వీళ్ల దోస్తీని చూసేందుకు ప్రేక్షకుడికి రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఇక వీళ్ల కుస్తీని చూసి కళ్లు చెమ్మగిల్లించినవారు కూడా ఉన్నారు. ఈ అద్భుత కళాఖండానికి రాజమౌళి దర్శకత్వం వహించగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించాడు. మార్చి 25న రిలీజైన ఈ మూవీ ఆగేదే లే అన్న రీతిలో రికార్డులను తొక్కుకుంటూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.
అయితే ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ రిలీజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా హిందీ, విదేశీ భాషల వర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆర్‌ఆర్‌ఆర్ జూన్ 3 నుంచి జీ5లో ప్రసారం కానుందట. హిందీ సహా విదేశీ భాషల వర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ అదే రోజు లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందట! సినిమాలు రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తరుణంలో ఆర్‌ఆర్‌ఆర్ మాత్రం ఏకంగా రెండున్నర నెలల తర్వాతే ఓటీటీ బాట పడుతుండటం విశేషం. మరి నిజంగానే ఆర్‌ఆర్‌ఆర్ జూన్ 3 నుంచి జీ 5లోకి అందుబాటులోకి వస్తుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: తల్లయ్యాక కాజల్ పెట్టిన ఫస్ట్ పోస్ట్, తల్లి కావడం అంత ఈజీ కాదట!
Comments
Please login to add a commentAdd a comment