దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్‌గా, మెగా పవర్ స్టార్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్విటర్‌లో విడుదల చేసింది. ‘అందమైన, ప్రతిభవంతురాలైన జెన్నీఫర్.. @ఒలివియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.
అయితే ఒలివియా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఇందులో ఆమె బ్రిటీష్ యువతిగా కనిపించునున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ కూడా ఒలీవియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకులను నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఒలివియా ఫస్ట్‌లుక్‌కు సైతం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సీన్ల షూటింగ్‌ను జరుపుకుంట్ను ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.
Wishing the talented and beautiful #Jennifer @OliviaMorris891 a very Happy Birthday. #RRRMovie #RRR pic.twitter.com/JLXZPxDZMa
— RRR Movie (@RRRMovie) January 29, 2021
Comments
Please login to add a commentAdd a comment