Sai Pallavi Bollywood Entry, Will Play Sita Role In Ranbir Kapoor Movie - Sakshi
Sakshi News home page

Sai Pallavi Bollywood Entrty: ‘సీత’గా ఫిదా బ్యూటీ.. ఆ చిత్రంలో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ

Published Wed, Dec 7 2022 3:40 PM | Last Updated on Wed, Dec 7 2022 4:45 PM

Sai Pallavi Bollywood Entry, Play Sita Role In Ranbir Kapoor Movie - Sakshi

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. ‘ప్రేమమ్‌’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సాయి పల్లవి..ఇప్పుడు నార్త్‌ ఆడియన్స్‌ని మెప్పించేందుకు సిద్దమైందట.

బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌ నటిస్తున్న ఓ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ చిత్రంలో రణబీర్‌ రాముడిగా కనిపిస్తే.. సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతుందట.  ఇక ఈ చిత్రంలో రావణాసూరుడి పాత్రని  హృతిక్‌ రోషన్‌ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి సీతగా సాయి పల్లవి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement