యాక్షన్‌ రీసౌండ్‌ | Sairam Shankar Resound Movie Shooting In Ongole | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ రీసౌండ్‌

Published Sat, Dec 12 2020 5:49 AM | Last Updated on Sat, Dec 12 2020 5:49 AM

Sairam Shankar Resound Movie Shooting In Ongole - Sakshi

సాయిరామ్‌ శంకర్, రాశీ సింగ్‌

సాయిరామ్‌ శంకర్, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రీసౌండ్‌’. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. మురళీకష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్‌ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒంగోలులో జరుగుతోంది. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. లాక్‌డౌన్‌ అనంతరం హైదరాబాద్‌ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ప్రస్తుతం ఒంగోలులో కొన్ని ప్రధాన ఘట్టాలతో పాటు రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రంలో ఓవైపు ఎంటర్‌టైన్‌ చేస్తూ, మరోవైపు యాక్షన్‌తో అలరించే పాత్రను సాయిరామ్‌ శంకర్‌ చేస్తున్నారు.  ‘రీసౌండ్‌’ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: స్వీకార్‌ అవస్తి, కెమెరా: సాయిప్రకాష్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement