రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ఓటీటీ కంటెంట్‌పై కొద్ది రోజులుగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఈ వెబ్ సిరీస్‌పై కేంద్ర ప్రభుత్వమే స్పందించింది. దీంతో ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలని సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించాడు. ఓటీటీకి ఖచ్చితంగా సెన్సార్ ఉండాలని ఆయన స్పష్టం చేశాడు.
చదవండి: పుష్పరాజ్‌ను చూసి వెనక్కి తగ్గిన పులి.. అదిరిపోయిన పుష్ప టీజర్
అదే విధంగా ఓటీటీలో ఈ స్థాయిలో అభ్యంతకర వెబ్ సిరీస్‌లు రావడానికి కారణం డైరెక్టర్ రామ్ గోపాల వర్మ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్‌గా 68వ ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌కు ఓటీటీ వెబ్ సిరీస్‌లపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ ఇదంత రామ్ గోపాల్ వర్మ వల్లే అని వ్యాఖ్యానించాడు. ‘రోజు రోజుకు ఓటీటీలో అభ్యంతరకర కంటెంట్ ఎక్కువైపోతుంది. వెబ్ సిరీస్‌లో గ్లామర్ షో, సెంటిమెంట్ సీన్స్ శృతిమించిపోతున్నాయి. దీనిని మొదలు పెట్టిందే రామ్ గోపాల్ వర్మ. ఓటీటీలో ఇలాంటి చెత్త కంటెంట్ రావడానికి ఆజ్యం పోసింది ఆయనే.
చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు
ఆ తర్వాత జనం దానికి అలవాటు పడిపోయారు. మూడు దశాబ్దాలకుపైగా నేను ఇండస్ట్రీలో ఉన్న. ఎప్పుడు ఇలాంటి కంటెంట్ సినిమాలు తీయలేదు’ అన్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో పిల్లల చేతుల్లోనూ మొబైల్స్ ఉంటున్నాయని, ఇలాంటి కంటెంట్ వాళ్లు చూస్తే చాలా ప్రమాదమన్నాడు. అందుకే ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలని సల్మాన్ డిమాండ్ చేశాడు. కాగా రామ్ గోపాల్ వర్మపై సల్మాన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. దీంతో సల్మాన్ కామెంట్స్ వర్మ ఎలా స్పందిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment