Salman Khan Suffered With Trigeminal Neuralgia Disease: ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్‌గా పిలిపించుకుంటున్నాడు సల్మాన్ ఖాన్. ఆయన ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయనకు కండల వీరుడు అనే బిరుదు వచ్చింది. ఇక బాలీవుడ్ హీరోల్లో సల్మాన్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. బి-టౌన్ లవర్ బాయ్ అయిన సల్మాన్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట.
చదవండి: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉపాసన, మెంటల్లి స్ట్రాంగ్‌గా ఉన్నానంటూ పోస్ట్
ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే నరాల రుగ్మతతో బాధపడినట్లు సల్మాన్ ట్యూబ్‌లైట్ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్ మాట్లాడుతూ.. తాను ట్రైజెమినల్ న్యూరాల్జియా తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డానని చెప్పాడు. ‘ఈ వ్యాధి వల్ల నేను ఎక్కువ సేపు మాట్లాడలేకపోయేవాడిని. మాట్లాడితే నా ముఖ భాగం చాలా నొప్పి అనిపించి మూతీ వంకరపొతుంది. బ్రష్ చేసుకున్న, మేకప్ వేసుకున్న నొప్పి తీవ్రంగా ఉండేది’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు
ఇక రాత్రి సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడేవన్నాడు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నానని, దీని కోసం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు సల్మాన్ చెప్పాడు. కాగా ట్రైజెమినల్ న్యూరాల్జియాను ఆత్మహత్య వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన అధిక శాతం మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారట. ఎందుకంటే ఈ వ్యాధి వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని వైద్యుల నుంచి సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment