అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత | Samantha New Year Parties With Naga Chaitanya And Friends In Goa | Sakshi
Sakshi News home page

గోవాలో స్నేహితులతో సందడి చేస్తున్న చైసామ్‌

Published Thu, Dec 31 2020 3:46 PM | Last Updated on Thu, Dec 31 2020 4:16 PM

Samantha New Year Parties With Naga Chaitanya And Friends In Goa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకల కోసం టాలీవుడ్‌ క్యూట్‌‌ కపుల్‌ సమంత-నాగచైతన్యలు స్నేహితులతో కలిసి గోవాలో వాలిపోయారు. అయితే వారికి ఇష్టమైన పర్యటక ప్రాంతం గోవాలో న్యూఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఈ జంట డిసెంబర్‌ 29న గోవాకు పయనమమైన సంగతి తెలిసిందే. సమంత డిజైనర్,‌ బెస్ట్‌  ఫ్రెండ్‌ శిల్పారెడ్డి, హర్షరెడ్డి, ప్రీతమ్‌ రెడ్డిలు కూడా  చైసామ్‌లతో కలిసి గోవాలో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత గురువారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ‘వృద్దాప్యం వరకు కూడా మేమంతా మంచి స్నేహితులమే’ అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. నాలుగేళ్ల క్రితం ఇదే స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటోను సమంత తన పోస్టుకు ట్యాగ్‌ చేశారు. (చదవండి: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు చైసామ్‌.. ఫోటోలు వైరల్‌)

అయితే ప్రస్తుతం సమంత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతువాకుల రేండు కాదల్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతికి జోడిగా సమంత నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో నయతార కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న‘లవ్‌స్టోరీ’ సినిమా షూటింగ్‌ కూడా పూర్తైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైకి జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. వచ్చే ఏడాది 2021లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో: సామ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement