Sarath Babu Nephew Aayush Tejas Fires On Fake Rumours About Sarath Babu Health - Sakshi
Sakshi News home page

Sarath Babu Health Update: శరత్‌బాబు ఆరోగ్యంపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే కేసు.. నటుడి సోదరుడి కుమారుడు

Published Fri, May 5 2023 8:25 AM | Last Updated on Fri, May 5 2023 9:04 AM

Sarath Babu Nephew Fires On Fake Rumours about Actor Health - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు శరత్‌బాబు ఆరోగ్యంపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్న వారిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్‌ తేజస్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలిసీ తెలియకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

ఆ వార్తల్ని వెంటనే సదరు యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాలో తొలగించని పక్షంలో సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారని వివరించారు. శరత్‌బాబు కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

చదవండి: చివరిసారి నంది అవార్డు అందుకున్న హీరో ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement