‘‘జీవితాంతం నేను నటుడిగానే ఉంటాను. సినిమా సెట్‌లో కన్ను మూయాలన్నదే నా సంకల్పం’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. భారతీయ చిత్ర పరిశ్రమకు తాను చేసిన సేవలకుగాను ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు షారుక్. ఈ సందర్భంగా ఆయన అక్కడి మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా ‘జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.
ఇందుకు షారుక్ బదులిస్తూ... ‘‘చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సినిమా సెట్‌లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు కట్ చె΄్పాక కూడా పైకి లేవకూడదు. ఇదే నా కోరిక’’ అన్నారు. అలాగే స్టార్‌డమ్‌ని మీరు ఎలా ఫీలవుతారు? అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయి. ఇక నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచిది’’ అన్నారు షారుక్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment