Shehbaz Badesha Tattoo: Siddharth Shukla Face And Shehnaz Gill Name On His Arm - Sakshi
Sakshi News home page

Sidnaaz: సిద్ధార్థ్‌ అకాల మరణం.. అభిమానాన్ని చాటుకున్న షెహనాజ్‌ సోదరుడు

Sep 18 2021 9:14 AM | Updated on Sep 18 2021 10:45 AM

Shehbaz Badesha Tattoo Sidharth Shukla face Shehnaaz Gill Name - Sakshi

అతను ఎప్పటికీ మన హృదయంలో నిలిచి ఉంటాడు’ అని కామెంట్‌ పెట్టగా, మరొకరు ‘సిద్నాజ్‌ ఫర్‌ ఎవర్‌’ అని భావోద్వేగానికి లోనయ్యాడు.

బిగ్‌బాస్‌ 13 విజేత, బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ శుక్లా ఇటీవల  గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నటుడి అకాల మరణం అతని సన్నిహితులు, అభిమానులను షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా సిద్ధార్థ్‌ రూమర్డ్‌ ప్రేయసీ షెహనాజ్‌ గిల్‌ బాధపడిన తీరు అందరి మనసులను కలిచివేసింది. అయితే స్నేహితుడు సిద్ధార్థ్‌ శుక్లాపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు గిల్‌ సోదరుడు షెహబాజ్‌ బడేషా.

అయితే ఇంతకుముందే బడేషా బాధను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుని,  సిద్ధార్థ్‌కి హృదయపూర్వక నివాళి అర్పించాడు. తాజాగా అతను స్నేహితుడు సిద్ధార్థ్‌ ముఖాన్ని చేతిమీద టాటుగా వేయించుకొని తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. దానికి కింద తన సోదరి షెహనాజ్‌ పేరు రాయించుకున్నాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి..‘నీ జ్ఞాపకాలు నీలాగే వాస్తవంగా ఉంటాయి. నువ్వు మా జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ జీవించే ఉంటావు’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఈ పోస్ట్‌కి ఎంతోమంది షెహనాజ్‌, సిద్ధార్థ్‌ అభిమానులు స్పందించారు. అందులో ఒకరు బాజ్‌ ‘ఐ లవ్‌ యూ సోదరా.. అతను ఎప్పటికీ మన హృదయంలో నిలిచి ఉంటాడు’ అని కామెంట్‌ పెట్టగా, మరొకరు ‘సిద్నాజ్‌ ఫర్‌ ఎవర్‌’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సిద్ధార్థ్‌, షెహనాజ్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లో కలుసుకున్న తర్వాత నుంచి వారిద్దరూ ‘సిద్నాజ్‌’గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement