
తాను పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ హైదరాబాద్‌తో చాలా కనెక్ట్ అయిపోయానని, ఇక్కడి ప్రాంతాలు ఎంతో నచ్చాయన్నారు.
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కన్నడ సినీతార శోభితా రాణ శుక్రవారం నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ ఫుడ్, ఇక్కడి ప్రజల ప్రేమ తనను కట్టిపడేశాయని ఆమె తెలిపారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో జక్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జక్ జ్యువెల్ ఎక్స్‌పో 133వ ఎడిషన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ రంగం పుంజుకుంటోందని అన్నారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. కన్నడలో తన సినిమా హిట్ కొట్టిందని, ప్రస్తుతం తన దృష్టంతా తెలుగు సినిమాలపైనే ఉందని తెలిపారు.
తెలుగులోనూ ఒక సినిమా చేశానని, ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాను పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ హైదరాబాద్‌తో చాలా కనెక్ట్ అయిపోయానని, ఇక్కడి ప్రాంతాలు ఎంతో నచ్చాయన్నారు. అనంతరం జక్ జ్యువెల్ ఎక్స్‌పోలో వివిధ రాష్ట్రాల వర్తక వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆభరణాల స్టాల్స్‌ను తిలకించారు.
చదవండి: కేరళతో ప్రేమలో ఉన్నా
చదవండి: ‘వేశ్య.. నీ రేటెంత అని అడుగుతున్నారు’