సల్మాన్‌ను పెళ్లి చేసుకునేందుకే వచ్చా: నటి | Somy Ali Says She Was Came To Industry For Marry Salman Khan | Sakshi
Sakshi News home page

‘హీరోయిన్‌ అవ్వాలని రాలేదు.. సల్మాన్‌ కోసమే వచ్చాను’

Published Tue, Feb 9 2021 5:35 PM | Last Updated on Tue, Feb 9 2021 6:36 PM

Somy Ali Says She Was Came To Industry For Marry Salman Khan - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్కు పరిశ్రమలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయిదు పదుల వయసులో కూడా ఇప్పటికి బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పేరొందిన సల్మాన్‌ ఎంతో మంది అగ్రహీరోయిన్లతో డేటింగ్‌ చేశాడు. ఇందులో సల్మాన్‌ మొదటి గర్ల్‌ఫఫ్రెండ్‌ ఎవరంటే అందరికి గుర్తోచ్చే పేరు పాకిస్తానీ భామ సోమీ అలీ. అమె హీరోయిన్‌గా కంటే సల్మాన్‌ ఖాన్‌ గల్‌ఫ్రెండ్‌గానే ఎక్కవగా ఫేం అయ్యారు. 2000 ఏడాది తర్వాత సినిమమాల్లో కనుమరుగైన సోమీ అలీ మళ్లీ మీ టూ ఉద్యమంతో తెరపైకి వచ్చారు. ఇక ఓ ఆర్గనైజేషన్‌ నడుపుతున్న ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. హీరోయిన్‌ అవ్వాలనే ఆశతో పరిశ్రమకు రాలేదని, కేవలం సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశయంతోనే ఇండియాకు వచ్చినట్లు చెప్పారు. 

‘పాకిస్తాన్‌లో స్కూలింగ్‌ అయ్యాక మేము అమెరికాకు వెళ్లిపోయాం. అక్కడ సల్మాన్‌ చిత్రం ‘మై నే ప్యార్‌ కియా’ చూసి ప్రేమలో పడ్డాను. వెంటనే మా అమ్మకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని, ఇండియాకు వెళతానని చెప్పాను. మా నాన్నకు ముంబైలో బంధువులు ఉన్నారని వాళ్లని కలవడానికి వెళ్తున్నట్లు చెప్పి ఇండియాకు వచ్చాను. అప్పుడు నాకు 16 ఏళ్లు’ అని చెప్పుకొచ్చారు. ఇక తను ముంబై వచ్చాక ఓ స్టార్‌ హోటల్‌లో దిగానని, సల్మాన్‌పై తనకు ఉన్న పిచ్చి చూసి వారంతా నవ్వుకునేవారని చెప్పారు. కాగా సోమీకి ముంబైలో మోడలింగ్‌లో చేస్తుండగా హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన అంత్‌(1994), కృష్ణ అవతార్‌(1993)తో పాటు ‘అవో ప్యార్‌ కరేనా’(1994) చిత్రాల్లో నటించిన ఆమె సల్మాన్‌తో డేటింగ్‌ చేశారు. ఆ తర్వాత 1999లో సల్మాన్‌తో బ్రేకప్‌ తర్వాత తిరిగి సోమీ అమెరికా వెళ్లి పోయారు. 

చదవండి: సల్మాన్‌ విషెస్‌: మీకర్థమవుతోందా?

చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్‌ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement