Sonam Kapoor Sells Duplex Apartment In Mumbai, Deets Inside - Sakshi
Sakshi News home page

Sonam Kapoor: లగ్జరీ ఇంటిని అమ్మేసిన హీరోయిన్‌, ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published Wed, Jan 4 2023 4:31 PM | Last Updated on Wed, Jan 4 2023 6:50 PM

Sonam Kapoor Sells Duplex Apartment, Deets Inside - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసింది. ముంబై బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌(బీకేసీ)లోని తన డూప్లెక్స్‌ అమ్మేసినట్లు తెలుస్తోంది. జిమ్‌, మినీ థియేటర్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌డ్‌ స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ ఏరియా.. ఇలా అన్నిరకాల వసతులున్నాయా ఇంట్లో! అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టగానే ఓ వ్యక్తి అక్షరాలా రూ.32.5 కోట్లు ఖర్చుపెట్టి సొంతం చేసుకున్నాడట. కాగా బీకేసిలోని సన్‌టెక్‌ సిగ్నేచర్‌ ఐల్యాండ్‌లో ఉన్న డూప్లెక్స్‌ను  2015లో కొనుగోలు చేసింది సోనమ్‌. అప్పుడు దాని విలువ రూ.31.48 కోట్లు. వారం రోజుల క్రితం (డిసెంబర్‌ 29న) ఈ ఇంటిని రూ.32.5 కోట్లకు అమ్మేసింది.

ఇకపోతే సోనమ్‌, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ లండన్‌లో నివసిస్తున్నారు. గతేడాది మార్చిలో తాను గర్భవతి అయిన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది సోనమ్‌. తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సైతం షేర్‌ చేసింది. ఆగస్టులో పండంటి బాబుకు జన్మనిచ్చింది. అతడికి వాయు అని నామకరణం చేసింది.

చదవండి: రష్మికపై ట్రోలింగ్‌, రాళ్లు కూడా విసురుతారన్న హీరో
లైవ్‌లో దొరికిపోయిన రష్మిక.. విజయ్‌ దేవరకొండ వాయిస్‌ పట్టేసిన ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement