సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి మాలీవుడ్‌కు చెందిన సినీప్రముఖలు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కాగా తిరువనంతపురంకు చెందిన హరికుమార్ మొదట బ్యాంకు అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుపెట్టారు. తన మేనమామ మాలీవుడ్ కమెడియన్ అదూర్ భాసీ సహకారంతో పలు చిత్రాల్లో నటించారు. హరికుమార్ మలయాళ సాహిత్య సర్కిల్‌లో చురుకుగా ఉన్నారు. నటుడిగానే కాకుండా మంచి రచయితగా మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
చదవండి:
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక
Comments
Please login to add a commentAdd a comment