
రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకలో శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ మూవీ అరంగేట్రం. సైకో, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు మంచి ప్రేమకథ ఉంటుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది అన్నారు. మా అరంగేట్రం చాలా బాగా వచ్చింది అన్నారు మహేశ్వరి. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా నిర్మించాం అన్నారు సహనిర్మాత విజయలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment