Sri Sudha Bhimireddy Gives Strong Kick To Man Who Misbehaved With Her - Sakshi
Sakshi News home page

Sri Sudha Bhimireddy: వెనకాల కూర్చున్న వ్యక్తి వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన అ‍ర్జున్‌ రెడ్డి నటి

Published Wed, Jul 26 2023 10:49 AM | Last Updated on Wed, Jul 26 2023 11:19 AM

Sri Sudha Gives Strong Kick to Man Who Misbehaved with Her - Sakshi

తెలుగు నటి శ్రీసుధకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల విమానంలో ప్రయాణించిన ఆమెకు అక్కడ ఓ ఆకతాయి తన చేష్టలతో ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి అదే పనిగా కాళ్లను ముందుకు చాచుతూ తనను తాకే ప్రయత్నం చేశాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు. అతడి వెకిలిచేష్టల గురించి సిబ్బందికి చెప్పినా ఫలితం లేకపోయింది. మాటలతో చెప్తే లాభం లేదనుకున్న ఆమె శక్తినంతా కూడదీసుకుని దెబ్బ రుచి చూపించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. అతడు తనను ఏరకంగా ఇబ్బందిపెడుతున్నాడో తెలియజేసేలా ఓ ఫోటోను షేర్‌ చేసింది.

ఇంత చిన్నదానికే అంత రాద్ధాంతం అవసరమా?
ఇందులో అతడు తన రెండు కాళ్లను శ్రీసుధ సీటు కింద పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. 'దీనిపై ఎలా స్పందించాలి? సిబ్బందికి రెండుసార్లు చెప్పి చూశాను.. అయినా అతడి బుద్ధి మారలేదు. అందుకే ఒక్కటిచ్చాను. అతడి బొక్కలు విరిగితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు' అని రాసుకొచ్చింది. కొందరు సుధ చేసిన పనిని మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం అలా కొట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇంత చిన్నదానికే అంత రాద్ధాంతం అవసరమా? అధికారులకు ఫిర్యాదు చేస్తే సరిపోయేదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి శ్రీసుధ స్పందిస్తూ.. నాకు ఆ మాత్రం తెలియదా? రెండుసార్లు చెప్పి చూశాను, కానీ పట్టించుకోలేదు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఎవరీ శ్రీసుధ
కాగా శ్రీసుధ.. అర్జున్‌ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్‌, వలయం, వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి తదితర‌ చిత్రాల్లో నటించింది. ఆమె నటి మాత్రమే కాదు ఫిజియోథెరపిస్ట్‌ కూడా! రెండేళ్ల క్రితం ఓ పెద్ద వివాదంలో నిలిచింది శ్రీసుధ. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కే.నాయుడు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడ‌ంటూ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో తాను రాజీకి వచ్చానని తప్పుడు పత్రాలు సృష్టించాడంటూ ఓ పోలీసాఫీసర్‌పైనా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంలో సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ సాయిరాం మాగంటి.. శ్యామ్‌ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి.

చదవండి: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీరోజ్‌
రష్మిక మందన్నాకు మరో సూపర్‌ ఛాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement