
కరోనా నుంచి కోలుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నారు. గురువారం ఆయన తన భార్య రమతో కలిసి చామరజనగర్ జిల్లాలోని హిమవద్ గోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కరోనా బారిన పడిన రాజమౌళి కుటుంబం కొద్ది రోజుల క్రితం ఆ వైరస్‌ను జయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు జక్కన్న ఆలయ సందర్శన చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా రాజమౌళి చివరి సారిగా పని చేసిన "బాహుబలి -ద కన్‌క్లూజన్" చిత్రం ప్రేక్షకులను పలకరించి రెండేళ్లు దాటిపోతోంది. ఆ తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రం "ఆర్ఆర్ఆర్"కు ఆయన పని చేస్తున్నారు. కానీ కరోనా వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, నటుడు అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. (ఆదిపురుష్.. జక్కన్న రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment