సినిమాల కంటే గ్లామర్ ఫొటోషూట్‌లతోనే ఎక్కువగా గుర్తింపును సొంతం చేసుకుంది పూనమ్ బజ్వా. ఎక్కువగా కుర్రకారులో హాట్ బీట్ పెంచే ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె సోషల్‌మీడియా ఖాతాలో కూడా ఎక్కువగా హాట్ పోజులతో ఉన్న ఫోటోలే కనిపిస్తాయి.
పూనమ్ బజ్వా నట ప్రయాణం తెలుగు సినిమాలతోనే మొదలైంది. కెరీర్ ఆరంభంలోనే నాగార్జున, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయినా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. బాస్, పరుగు తదితర చిత్రాలతో మెరిసిన ఈ బ్యూటీ టాలీవుడ్ కంటే మాలీవుడ్, కోలీవుడ్‌లో ఎక్కువ చిత్రాల్లో నటించింది.
కొద్దిరోజుల క్రితమే తన ప్రియుడిని కూడా ఈ బ్యూటీ పరిచయం చేసింది. 'సునీల్ రెడ్డి.. మై రూట్స్, గ్రౌండ్, వింగ్స్, హ్యాండ్సమ్, అందమైన హృదయం ఉన్న నా లైఫ్ మేట్, సోల్ మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. మాటల్లో వర్ణించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని పూనమ్ తనపై ప్రేమను తెలిపింది. ప్రియుడిని పరిచయం చేసిన రోజు నుంచి తనలో మార్పు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలారోజుల తర్వాత ఆమె ఇలా చీరలో కనిపించేసరికి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment