Allu Arjun Pushpa Movie Updates: పుష్ప రిలీజ్‌ డేట్‌పై సుకుమార్‌ అసంతృప్తి! | Allu Arjun Next Movie With Koratala Siva - Sakshi
Sakshi News home page

పుష్ప రిలీజ్‌ డేట్‌పై సుకుమార్‌ అసంతృప్తి!

Published Tue, Feb 2 2021 10:48 AM | Last Updated on Tue, Feb 2 2021 1:46 PM

Is Sukumar Is Not Happy With Pushpa Release Date Announcement - Sakshi

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లలోని మోతుగూడెంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. దీనిలో రష్మిక మందనా కథానాయిక. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.‘అల వైకుంఠపురంలో’ సినిమాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చదవండి: షూటింగ్‌: అల్లు అర్జున్‌ ఎమోషనల్‌

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా రీలిజ్‌ డేట్‌ అనౌన్స్‌తో డైరెక్టర్‌ సుకుమార్‌ అసంతృప్తిగా ఉన్నారని దీని సారాంశం. అసలేం జరిగిందంటే.. మిగతా సినిమాలతో పోలీస్తే‌ పుష్ప మూవీ యూనిట్‌ త్వరగానే రిలీజ్‌ డేట్‌ను కన్ఫర్మ్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బన్నీ అభిమానులు పుష్ప వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని భావించారు. అయితే మేకర్స్ ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడంతో ఫాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్‌ బలవంతం చేయడం వల్లే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీ పట్ల దర్శకుడు సుకుమార్‌ సంతోషంగా లేరని తెలుస్తోంది. ఇంకా 170 రోజుల షూటింగ్‌ మిగిలి ఉన్న నేపథ్యంలో విడుదల తేదీని ఇంత త్వరగా నిర్ణయించడం సుకుమార్‌పై ఒత్తిడి తీసుకోస్తుందటా. కానీ దర్శకుడు మాత్రం ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఈ చిత్రాన్ని షూట్ చేయాలనుకుంటున్నాడు.

అయితే అల్లు అర్జున్ మాత్రం జూలై నాటికి పుష్పకు ప్యాకప్‌ చెప్పాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా మే 13న విడుదల కానుంది. ఆ తరువాత ఈ దర్శకుడు ఫ్రీ కానున్నాడు.  బన్నీ తన నెక్స్ట్‌ మూవీని కొరటాల శివతోనే చేయనున్నాడు. దీంతో దర్శకుడిని వెయిట్‌ చేయించడం ఇష్టం లేకుండా పుష్ప సినిమాను తొందర పెట్టినట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి సమయానికి షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ చేస్తారా లేకుండా విడుదల తేదీ వాయిదా పడుతుందా అన్న విషయం తెలియలాంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement