
సాక్షి,చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 'అనారోగ్య కారణాలతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలని చాలామంది అడుతున్నారు. అభిమానులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా' అని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత రజనీ పొలిటికల్ టాక్‌తో తమిళనాట మరోసారి చర్చనీయాంశమైంది.
గతేడాది రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్ చివరి నిమిషంలో అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో తన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇటీవలె వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన ఆయన ఇటీవలె చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో జులై 12న జరగనున్న సమావేశానికి హాజరుకావలంటూ తన అభిమాన సంఘానికి ఆహ్వానం పంపడంతో తలైవా పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మరోసారి ఊపందకున్నాయి. ఇప్పుడు అభిమానులతో చర్చించి త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని రజనీ ప్రకటించడం పొలిటికల్ హీట్‌ను పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment