తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ,హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నమస్తే సేట్ జీ’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వప్న చౌదరి, మోన, రేఖ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ "యూ" సర్టిఫికెట్‌ని అందుకున్న ఈ సినిమా 80 శాతం సింగిల్ లొకేషన్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ డెవలప్మెంట్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 'నమస్తే సేట్ జీ' సినిమా టీం ని అభినందించారు.
డైరెక్టర్, హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ‘కిరాణా షాప్ వారి జీవన విధానాల పైన రూపొందించిన ఈ సీనిమా రెండు పార్ట్‌లుగా విడుదల అవ్వబోతుంది. నమస్తే సెట్ జీ పార్ట్ 1 ని రీసెంట్ గా షూట్ చేశాం.ఇది కామెడీ మెస్సేజ్ జోనర్ లో ఉంటుంది. ఈ సినిమా ని 80 శాతం సింగిల్ లొకేషన్ లో షూట్ చేయడం జరిగింది. కొత్తగా ఉంటుంది అని సింగిల్ లొకేషన్ లొనే సినిమా ని షూట్ చేశాం. ఓపికగా, అర్థం చేసుకుంటే సినిమా చాలా మంది ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. త్వరలో నమస్తే సెట్ జీ పార్ట్ 2 కి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment