
నిరంతర కృషి, అంకితభవంతో ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని 'నమస్తే సేట్ జీ' హీరోయిన్ స్వప్నా చౌదరి అమ్మినేని అన్నారు. తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఈ నెల 9న విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ రోజు స్వప్నా చౌదరి జన్మదినం సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు.
స్వప్న చౌదరి మాట్లాడుతూ.. 'ఈ పుట్టిన రోజు నాకెంతో ముఖ్యమైనది. నేను కథానాయికగా నటించిన మొదటి చిత్రం ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మరిచిపోలేని అనుభూతి. వాస్తవానికి సక్సెస్ చాలా ఈజీ.. దాని కోసం నిరంతరం చేసే ప్రయత్నమే చాలా కష్టం. నేను పుట్టి పెరిగిందంతా ఖమ్మంలోనే. నటనలో మంచి పేరు తెచ్చుకోవాలని చిరకాల కోరిక. కానీ మొదటి సినిమాతోనే అది పదిలం అవుతుందని అనుకోలేదు. దీనంతటికీ ముఖ్య కారణం సినిమా డైరక్టర్ తల్లాడ సాయి కృష్ణ. ఈ సినిమా విజయంలో మూవీ టీం సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. త్వరలో మరో సినిమాలో చేసే ఆలోచనలో ఉన్నా.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment