సామాజిక సమస్యలు ఇతి వృత్తంగా రూపొందిన చిత్రాలకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక ముఖ్య సమస్య ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న చిత్రం వెప్పం కుళీర్ మళై. హేస్టేక్ ఎఫ్‌డీఎఫ్ ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ధీరవ్ నిర్మించి, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇస్మత్ భాను హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు కిశోర్‌కుమార్, నటి సుభద్ర జంటగా సంగీతం నేపథ్యంలో మెల్లిసై అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ధీరవ్.. ఇంతకు ముందు అసురన్, బొమ్మై నాయకి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారన్నది గమనార్హం. నటుడు ఎంఎస్.భాస్కర్, రామా, మాస్టర్ కార్తీకేయన్, దేవ్ హబిబుల్లా, విజయలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పో షిస్తున్నారు. దీనికి భాస్కల్ వేదముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కుట్రం కడిదల్ చిత్రానికి సహాయ దర్శకుడిగానూ, మగళీర్ మట్రుం, సుళల్ వెబ్ సిరీస్‌కు అసోసియేట్ దర్శకుడిగానూ పని చేశారన్నది గమనార్హం.
కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం దర్శకుడు వెట్రిమారన్ ఆవిష్కరించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి పృధ్వీ రాజేంద్రన్ చాయాగ్రహణం, శంకర్ రంగరాజన్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment