ముగ్గురు స్నేహితులు కథానాయకిని ప్రేమించే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం నాన్ వేర మాదిరి. మాధుర్య ప్రొడక్షన్స్ పతాకంపై మనో కృష్ణ నిర్మిస్తున్న చిత్రం నాన్ వేర మాదిరి. దీనికి దేవకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు మలయాళంలో సిగ్నల్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. దేవకుమార్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం నాన్ వేర మాదిరి. ఈ చిత్రంలో నటి మేఘ్నా ఎలన్ కథానాయికిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో నరేన్, మనోబాల, ముత్తుకాళైలతో నవనటులు మనోకృష్ణ, రమేష్‌మార్, కార్తీక రాజా, థాను నటిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు స్నేహితులు ఒక యువతిని ప్రేమిస్తారన్నారు. అయితే ఆమె కూడా వారి ప్రేమను అంగీకరిస్తుందన్నారు. అందుకు కారణం ఏంటి అన్న ఆసక్తికరమైన కథాంశంతో సస్పెన్స్, థ్రిల్లర్‌తో రూపొందిస్తున్న చిత్రం నాన్ వేర మాదిరి అని పేర్కొన్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
చదవండి: బిగ్‌బాస్’ ఆఫర్ వచ్చింది.. కానీ
ముగ్గురు స్నేహితుల ప్రేమలో హీరోయిన్
Published Sat, Apr 24 2021 7:59 AM | Last Updated on Sat, Apr 24 2021 9:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment