Vijay To Pair Up With Samantha For 'Thalapathy 67' - Sakshi
Sakshi News home page

Samantha: ఆ హీరో సినిమాలో సమంతనే హీరోయిన్‌.. రీజన్‌ అదేనట

Published Tue, Apr 4 2023 7:16 AM | Last Updated on Tue, Apr 4 2023 10:23 AM

Thalapathy Vijay To Pair Up With Samantha In His Next Movie - Sakshi

నటుడు విజయ్‌ తనకు అచ్చొచ్చిన హీరోయిన్లతోనే నటించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా నటిస్తున్న లియో చిత్రంలో త్రిష నాయకిగా నటిస్తోంది. ఇది హిట్‌ ఫెయిర్‌. ఇప్పటికే విజయ్‌, త్రిష కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు. కాగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న లియో చిత్రం షూటింగ్‌ వేగంగా జరుపుకుంటోంది. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా దీని తరువాత అట్లీ దర్శకత్వంలో నటించడానికి విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

అట్లీ ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌, నయనతార జంటగా నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా విజయ్‌ తన తదుపరి చిత్రంలో నటించే హీరోయిన్‌ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. చిత్రాన్ని ఎవరు నిర్మించినా అందులో కథానాయకిగా మాత్రం సమంతనే అన్నది ఆ నిర్ణయమట. విజయ్‌తో సమంత ఇంతకు ముందు కత్తి, మెర్శల్‌, తెరి చిత్రాల్లో నటించారు.

ఆ మూడు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే తన తదుపరి చిత్రంలో సమంత హీరోయిన్‌ అని నిర్ణయించుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా నటి సమంత ఇటీవల నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం యశోద సక్సెస్‌ అయ్యింది. తాజాగా నటించిన చారిత్రక కథాచిత్రంగా శాకుంతలం ఈ నెల 14 పాన్‌ ఇండియా చిత్రంగా తెరపై రానుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంతో పాటు హిందీ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement