
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ధరమ్ తేజ్‌ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment