
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో సినీతారలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కంగనా రనౌత్, రాధిక శరత్‌కుమార్‌కు బీజేపీ టికెట్స్ కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా.. తమిళనాడులోని విరుధునగర్ నుంచి రాధిక బరిలో నిలిచారు. తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో మరో హీరోయిన్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది.
గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన హీరోయిన్ నవనీత్ కౌర్ విజయం సాధించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. అమరావతి నుంచే ఆమె పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. నవనీత్ కౌర్ టాలీవుడ్‌లో యమదొంగ, గుడ్ బాయ్, రూమ్‌మేట్స్, శీనువాసంతి లక్ష్మి, మహారథి, జాబిలమ్మ లాంటి చిత్రాల్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.
धन्यवाद...🙏🙏 pic.twitter.com/I4TWf7FnYl
— Navnit Ravi Rana (Modi Ka Parivar) (@navneetravirana) March 27, 2024