బుల్లితెర నటి తునీషా శర్మ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే! శనివారం మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాసై సీరియల్ సెట్‌లోని మేకప్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె ఇరవై ఏళ్లకే చనిపోవడమేంటని సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియా షేర్ చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. అందులో మేకప్ రూమ్‌లో కూర్చున్న తునీషా మణికట్టుకు గాయం అయినట్లుగా ఓ గీత పెట్టారు. మరో పోస్ట్‌లో ప్యాషన్‌తో ముందడుగు వేసేవారిని ఎవ్వరూ ఆపలేరు అని రాసుకొచ్చింది నటి. కాగా తునీషా ప్రస్తుతం అలీ బాబా దస్తాన్ ఇ కాబూల్ అనే సీరియల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే! టెలివిజన్‌పై ప్రసారమైన పలు సీరియల్స్‌తో పాటు ఫితూర్, బార్ బార్ దేఖో, దబాంగ్ 3 వంటి చిత్రాల ద్వారా వెండితెరపైనా అలరించింది తునీషా.
Comments
Please login to add a commentAdd a comment