ఆసక్తికరంగా 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' ఫస్ట్ లుక్ | Under World Billionaires First Look Released | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' ఫస్ట్ లుక్

Published Wed, Jan 11 2023 2:06 PM | Last Updated on Wed, Jan 11 2023 4:30 PM

Under World Billionaires First Look Released - Sakshi

అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిరీస్ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్'.గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ ను ఎల్‌ఎస్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. స్టైలిష్ లుక్ లో అరవింద్ కృష్ణ కనిపిస్తుండగా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్న ఈ లుక్ సిరీస్ పై మంచి అంచనాలు పెంచుతుంది.

ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధు సూధన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్ మరియు రవి మల్లిడి  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement