Unstoppable with NBK: మూస ధోరణిలో సాగుతున్న హోస్టింగ్‌కు చరమగీతం పాడాడు నందమూరి బాలకృష్ణ. ఎక్కడలేని ఎనర్జీతో, ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో, కలుపుగోలుతనంతో, కామెడీ టైమింగ్‌తో అన్‌స్టాపబుల్ షోను పరుగులెత్తిస్తున్నాడు. బాలయ్య ఏంటి? వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏంటి? అని కామెంట్ చేసినవాళ్లను తన హోస్టింగ్ స్టైల్‌తో ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విజయవంతంగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో తాజాగా దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ మేరకు ఆహా ప్రోమో రిలీజ్ చేసింది.
'లాక్‌డౌన్‌లో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబు' అంటూ రానా మీద జోకులేశాడు బాలయ్య. 'అన్నీ చేసేశాను, చేయనిది ఏదైనా ఉందా? అంటే అది పెళ్లి మాత్రమే, అందుకే పెళ్లి చేసుకున్నా' అని సరదాగా ఆన్సరిచ్చాడు భళ్లాలదేవ. పనిలో పనిగా బాలయ్యను కొన్ని ప్రశ్నలడిగాడు రానా. ఏదైనా గొడవైతే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? అని ప్రశ్నించగా 'కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు, బాలకృష్ణుడొక లెక్కా?' అని ఆన్సరిచ్చాడు బాలయ్య.
'మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్యూ చెప్పారా?' అని అడగ్గా 'నీకెందుకయ్యా?' అని బాలయ్య కౌంటరిచ్చాడు. కానీ ఆ వెంటనే ఫోన్ తీసి భార్యకు కాల్ చేసి 'వసూ, ఐ లవ్యూ' అని చెప్పగా.. మీరు ఎప్పటికీ నన్ను ప్రేమిస్తారని నాకు తెలుసు అని బదులిచ్చింది బాలయ్య భార్య. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఎపిసోడ్ జనవరి 7న ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment