Upasana Sister Marriage: Invites Transgender Community, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana Konidela: ట్రాన్స్‌జెండర్‌ కమ్యునిటీతో ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, ఆశీర్వాదాలు

Published Fri, Dec 3 2021 9:27 PM | Last Updated on Sat, Dec 4 2021 9:06 AM

Upasana Invites Transgender Community For Her Sister Wedding Celebrations - Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యగా, అపోలో అధినత మనవరాలిగా కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని కొణిదెలగా ఆమె తనకంటూ ఓ బ్రాండ్‌ నేమ్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక ఫిట్‌నెస్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలు, భర్త  రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు.

చదవండి: ప్రియమణిపై అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఇటీవల సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో  జెండర్‌ డిస్‌క్రిమినేషన్‌పై స్పందిస్తూ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ అని చెప్పారు. అయితే ఇప్పుడు తన ట్రాన్స్‌ జెండర్‌ కమ్యునిటీలో కలిసి తీసుకున్న ఫొటోలను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన సోదరి అనుష్ పాలా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా ఉపాసన ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీ సభ్యులను ఇంటికి ఆహ్వానించి వారితో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 

చదవండి: రాజ‘శేఖర్‌’ మూవీకి ఓటీటీ షాకింగ్‌ రేట్స్‌!

‘ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది మానవత్వం, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి ఒక సరైన అవకాశం. భారతదేశంలోని పురాతనమైన వాటిలో ఇది ఒకటి. అనుష్ పాల్ వివాహ వేడుకలను అప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలానేది మీరు ఎల్లప్పుడూ నాకు నేర్పుతారు. హైదరాబాద్‌లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమాజాన్ని నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను.  హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం విశేషంగా భావిస్తున్నాం. జీవితం గురించి చెప్పడానికి వారి వద్ద గొప్ప కథలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా సంభాషించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఉపాసన తన పోస్ట్‌లో షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement