
‘అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటించాలనే లక్ష్యంతో ‘యువర్‌లైఫ్.కో.ఇన్’ వెబ్‌సైట్‌ను స్థాపించాను’ అన్నారు ఉపాసన కొణిదెల. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత పేరును ప్రకటించారు ఉపాసన కొణిదెల. ఈ విషయం గురించి ఉపాసన మాట్లాడుతూ – ‘‘ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక మరియు భావోద్వేగాల సమతుల్యత వంటివి నేను నమ్మే సిద్ధాంతాలు. ఇవన్నీ అందరికీ చేరువ చేయాలని ఈ వెబ్‌సైట్ స్థాపించాను. ఇలాంటి ఆలోచనలే సమంత కూడా పాటిస్తున్నారు. స్వయంకృషితో ఎదిగిన సమంత ఆలోచనలు, సూచనలు మా పాఠకులకు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నాం’’ అన్నారు ఉపాసన. ‘‘జస్ట్ అలా కూర్చుని ఉంటే పర్ఫెక్ట్ కాలేం. లేవండి.. కదలండి.. ఫిట్ అవ్వండి’’ అన్నారు సమంత.