website launched
-
175 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు.. వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన రక్తదానంకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19న క్రీడా పోటీలు, మహిళలకు సంబంధించిన పోటీలు, 20న మొక్కలు నాటడం, 21న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు,సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సుస్ధిరమైన అభివృధ్ది సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని మూడున్నరేళ్ల కాలంలోనే తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిన ఘనత సీఎం జగన్‌ది అని సజ్జల అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్ళలోనే 99 శాతం పూర్తి చేశారన్నారు. ఇచ్చిన హామీలకంటే వంద రెట్లు ఎక్కువగా పథకాలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గాలు ఆర్థికంగా బలపడేలా చేయడంతోపాటు వారికి విద్య, వైద్యపరంగాను, ఉపాధి మెరుగైన సేవలు అందించారన్నారు. వీటన్నింటికి మించి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేసి చూపించారన్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని భావించామన్నారు. ప్రతిసారి పార్టీ తరఫున చేస్తుంటాం. ఈసారి కోట్లాది మంది అభిమానులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదాదారులు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళాపక్షపాత ప్రభుత్వం, వారికి పెద్దపీట వేశారన్నారు. అప్పుడు 38వేల యూనిట్లు.. 2020లో రికార్డుస్ధాయిలో 38 వేల యూనిట్లు రక్తదానం చేసినట్లు సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు అందరూ శిబిరాలకు వచ్చి రక్తదానం చేశారు. తమ నాయకుడైన సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరోవైపు తమ భాధ్యతగా అవసరమైనవారికి రక్తం ఇవ్వాలనే మహోన్నత ఆశయంతో ఆనాడు రక్తదానం చేశారన్నారు. అప్పుడు కూడా రెడ్ క్రాస్, వైఎస్సార్సీపీ కలిసి రక్తదాన కార్యక్రమం నిర్వహించాయన్నారు. ఆ రోజున బ్లడ్ ఎక్కువ కాలం స్టోర్ చేశారు. నిజంగా అవసరమైనప్పుడు ఇస్తే బాగుంటుందనే భావించామన్నారు. అందుకే ఈసారి ఫిజికల్‌గా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వెబ్ సైట్ కూడా లాంచ్ చేశాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాలలోను ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వారికి అది అందేలా చేయడం ఈ వెబ్ సైట్(www.ysrcpblooddonation.com) వల్ల వీలు కలుగుతుంది. కార్యకర్తలు, అభిమానులు తమ నాయకుడికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడంతోపాటు సామాజిక బాధ్యత నెరవేర్చినట్లు అవుతుందన్నారు. వివిధ కాలేజీలు, సంస్ధలు అందరూ కూడా ప్రమోట్ చేయాలని కోరుతున్నామన్నారు. తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు రక్తం ఎంతో అవసరం అన్నారు. రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్నిపురస్కరించుకుని విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రెడ్ క్రాస్ మన రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందన్నారు. 2020లో కూడా రెడ్ క్రాస్ ద్వారా రక్తదానశిబిరాల ద్వారా 38 వేల యూనిట్లు రక్తాన్ని సేకరించామన్నారు. ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడమే కాకుండా ప్లెడ్జ్ ఫామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఆన్ లైన్ లో కూడా ఇవ్వచ్చు లేదా రక్తదానశిబిరాల వద్దకు వచ్చి ఈ ఫామ్స్ ఇవ్వచ్చని తెలియచేశారు. అత్యవసర పరిస్దితులలో రక్తం అవసరమైనప్పుడు మేము సేకరించే డేటా ద్వారా రక్తదాతల ద్వారా అవసరమైనవారికి సహాయం అందిస్తామన్నారు. 175 నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సాంఘికసంక్షేమశాఖమంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ళఅప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్‌రెడ్డి, నారమల్లి పద్మజ, పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు సజ్జల భార్గవ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లు: మంత్రి బొత్స
-
ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం: సీఎం జగన్
-
ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. https://migapdtcp.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. తక్కువ ధరకే అన్ని వసతులతో ప్లాట్లు.. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం ప్లాట్లు, చదరపు గజం ధర ఇలా.. లే అవుట్ల ప్రత్యేకతలు.. న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు. పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. లేఅవుట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎలాంటి వసతులు, అవసరాల కోసమైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు వెచ్చించవచ్చు. -
ఇవి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఇంత త్వరగా పైలట్ ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఐటీ శాఖ, ఏపీఎస్ఎస్డీసీ, ఏపీఎన్ఆర్టీ, ఏపీఐఎస్, ఏపీఎస్సీహెచ్ఈ విభాగాల టీమ్ వర్క్‌ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగులకు ఎంతగానో ఉపశమనం కలగించే డబ్ల్యూఎఫ్ హెచ్‌టీ అధికారిక వెబ్ సైట్‌ను విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితులలో స్వగ్రామాలకు చేరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయం, కొన్ని చోట్ల ఆఫీస్ వాతావరణం లేక ఇబ్బందిపడ్డారని..అలాంటివారికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో కంపెనీలు ఉద్యోగుల ఖర్చుతగ్గించుకునే ప్రయత్నంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుమూల ప్రాంతాలలోనూ ఈ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఈ పైలట్ ప్రాజెక్ట్ కు స్పందనతో అంచనా వేసుకుంటామన్నారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్దనగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఏపీలోని మిగతా పట్టణాల్లో కేవలం రూ.4వేలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ అమౌంట్ కొన్ని కార్పొరేట్ సంస్థలు వసూలు చేసే మొత్తంలో 25 శాతం మాత్రమేనన్నారు. చదవండి: (మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే: సజ్జల) ల్యాప్ టాప్ తెచ్చుకుని హాయిగా పని చేసుకునే వీలుగా ప్రతి డబ్ల్యూఎఫ్ హెచ్‌టీలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ప్రమ్ హెమ్ టౌన్లను తీర్చిదిద్దామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కంపెనీలు, ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్‌ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని మంత్రి తెలిపారు భవిష్యత్ లో లక్ష మంది ఉద్యోగులు లక్షణంగా పని చేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తి కలిగిన ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 99888 53335 నంబర్‌కి సంప్రదించవచ్చు. లేదా www.apit.ap.gov.in/wfht/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఐ.టీ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శేషి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: (లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా.. మరి దొంగ ఓట్లు ఎలా?) -
కథల వర్ణన్
ఒక టీనేజర్ బామ్మగా మారిపోయింది. మీరు విన్నది నిజమే, పెద్దవాళ్లు పిల్లలకు కథ చెప్పే అలవాటు పోయిందంటూ రేపటి తరానికి కథలు చెప్పడానికి సిద్ధమైపోయింది పద్దెనిమిదేళ్ల ప్రియాల్ జైన్. ‘పిల్లలు మన భారతీయ సంస్కృతికి, వారసత్వానికి దూరం అవుతున్నారని పెద్దలు బాధపడుతుంటారు. ఇది వారి తప్పు కాదు. పిల్లలకి మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి దగ్గరయ్యేలా వారిలో స్ఫూర్తిని నింపాలి. అది మన బాధ్యత’ అంటోంది ప్రియాల్. రాజస్థాన్ వాసి అయిన ప్రియాల్ దేశవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ, జానపద కథలకు రూపం కూడా ఇస్తోంది. ప్రియాల్ జైన్ 12వ తరగతి చదువుతోంది. లాక్డౌన్ టైమ్‌ని సద్వినియోగ పరుచుకోవాలని ‘వర్ణన్’ అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించి, తను చిన్ననాటి నుంచి విన్న కథలన్నీ అందులో పొందుపరుస్తోంది. ఇంకెన్నో కథలను సేకరిస్తూ, వాటిని రేపటితరానికి అందిస్తోంది. శతాబ్దాల జ్ఞానం ‘నా చిన్నప్పుడు మా బామ్మ నా హిస్టరీ బుక్‌లో ఉన్న పాఠాల కన్నా ఎన్నో కథలు చెప్పేది. అవన్నీ నేను మరచిపోలేనివి. ధైర్యవంతులైన స్త్రీ పురుషుల కథల గురించి, మార్మికమైన పౌరాణిక పాత్రల గురించి, విశ్వాసపాత్రమైన జంతువుల గురించి... ఇలా ఎన్నో కథలు. నేను పెద్దయ్యాక మా నాన్న ఉద్యోగరీత్యా నా చదువుకోసం బామ్మ నుంచి దూరంగా వెళ్లిపోయాం. నా చెల్లెలికి పదేళ్లు ఉంటాయి. తనకి కథలు చెప్పడానికి ఎవరూ లేరు. ఈ ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్లో తరగతులు. నాకైతే ఒకే క్లాసులో ఉన్న భావన కలుగుతోంది. పిల్లలకు ఆటలు లేవు. అలాగే, మన భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలో పొందుపరిచిన శతాబ్దాల మిశ్రమ జ్ఞానం కూడా పొందలేకపోతున్నారు. ఇది గ్రహించే నేను ‘వర్ణన్’ అనే వెబ్సైట్ ప్రారంభించాను. ఇందుకు మా నాన్న నాకు సపోర్ట్‌నిచ్చారు. శతాబ్దాల నాటి భారతీయ జ్ఞానాన్ని అంతా సజీవంగా ఉంచాలనుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని తరువాత తరానికి తీసుకెళ్లకపోతే ఎంతో కాలం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ కథ చెప్పే బామ్మగా వర్ణన్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని తన ఆలోచన రూపం దాల్చిన విషయం గురించి చెబుతుంది ప్రియాల్. 6 నుంచి 106 ఏళ్ల వయసున్న కథలు ‘మా కథల సేకరణ పిల్లల్లో ఊహాన్వేషణను ప్రోత్సహిస్తుంది. ఏ మాత్రం బోర్ కొట్టవు. బెడ్ టైమ్ కథలతోపాటు, పెద్దలను కూడా వినోదంతో ఆకట్టుకునేలాంటి కథలు మా ‘వర్ణన్’లో ఉంటాయి. అంటే ఐదారేళ్ల పిల్లలతో పాటు నూరేళ్ల వయసు దాటిన వారినీ మా కథలు ఆకట్టుకుంటాయి. ‘వర్ణన్’ మీకు ఇష్టమైన కథ చెప్పే తాత, బామ్మ లాంటిది. ప్రేరణ కలిగించేది, ఆలోచన పెంచే విధంగా ఉంటుంది’ అని తన వర్ణన్ గురించి వర్ణించి మరీ చెబుతుంది ప్రియాల్. కథకుల బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టిన కథా పందిరి వర్ణన్కు కథలు అందించేలా 30 మంది దాకా బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రియాల్. వారి ద్వారా కథా సేకరణ చేస్తోంది. వాటిన్నిటికీ ఒక రూపం ఇచ్చి, ఎడిట్ చేసి వెబ్సైట్లో ఉంచుతూ ఈ తరానికి కథల ప్రయోజనాన్ని తెలియజేస్తోంది. కథల మూటతో జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని తపించే నవతరపు ప్రతినిధి ప్రియాల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
సుశాంత్‌కి న్యాయం జరగాలి!
జూన్ 14.. 2020.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుది శ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయి జూన్ 14కి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటకు రావడం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయినా కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘వియ్ మిస్ యు’, 'JusticeForSushantSinghRajput' అని ట్రెండ్ చేశారు. వెబ్సైట్ ప్రారంభం... సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో www.ImmortalSushant.com పేరుతో వెబ్సైట్ ఆరంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాల వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి. నీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి – అంకితా లోఖండే సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యా¯Œ ్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాశారు. ‘పవిత్ర్∙రిష్తా’ సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రియా చక్రవర్తిని ప్రేమించారు సుశాంత్ సింగ్. ఇంకా సుశాంత్‌తో సినిమాలు చేసినవారు, అతని కుటుంబ సభ్యులు కూడా ట్వీట్ చేశారు.| సహాయం, సలహా లేదా నవ్వు.. ఇవి నాకెప్పుడు కావాలన్నా నువ్వు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నాతో ఉన్నావు. ఈ నటనా ప్రపంచానికి నీతోనే (సారా తొలి చిత్రం ‘కేదార్నాథ్’లో సుశాంత్ హీరో) పరిచయం అయ్యాను నేను. కలలు నిజమవుతాయనే నమ్మకాన్ని నాలో కలిగించిన నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈ మండుతున్న సూర్యుణ్ణి, వెలుగుతున్న చంద్రున్ని, ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూస్తున్న ప్రతిసారీ నువ్వు మాతోనే ఉన్నావని మాకు అనిపిస్తుంటుంది. – సారా అలీఖాన్ నీ ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న సంభాషణలతో పాటు నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నాకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఊహల్లో ఉన్న ప్రశాంతత నీకు దొరికిందనే ఆశిస్తున్నాను. – భూమీ పెడ్నేకర్ మన జీవితాలను రెండు భాగాలుగా చూసే కొన్ని çఘటనలు ఉంటాయి. సుశాంత్ మరణం మా జీవితాల్లో అలాంటిదే. మా కుటుంబసభ్యుల జీవితాలు సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. జీవించడానికి సంపాదించుకుంటున్నాం, మా పెద్దలను బాగానే చూసుకుంటున్నాం. ఇలా కొన్ని సాధారణ పనులు అందరి జీవితాల్లో జరిగినట్లుగానే మాకూ జరుగుతున్నాయి. కానీ మా అందరి ఆలోచనల్లో భర్తీ కానీ ఏదో శూన్యత దాగి ఉంది. అది మా జీవితాలను మార్చివేసింది. సుశాంత్ చాలామందికి దానాలు చేశాడు – సుశాంత్ బావ విశాల్ కృతి. జూన్ నెల అంతా పర్వత ప్రదేశాల్లో ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవు. నా సోదరుడికి చెందిన జ్ఞాపకాలను ఆ నిశ్శబ్ద వాతావారణంలో నెమరువేసుకుంటాను’’ అని ఈ ఏడాది మే 26న సుశాంత్‌సింగ్ సోదరి శ్వేతాసింగ్ కృతి ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు – శేఖర్ సుమన్ ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను కోరుకుంటున్నాను. అనుమానాస్పద రీతిలో సుశాంత్ మనకు దూరమై ఏడాది అవుతోంది. ఓ మంచి వ్యక్తి సమాజంలోని కొన్ని కారణాల్ల ఒత్తిళ్లకు లోనయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతున్నాను. అతని కేసు విషయంలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇలా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ జవాబులు ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ సుమన్. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరమయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతు న్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం, సర్వస్వం నువ్వు. నాకు తెలుసు.. నువ్వొక గార్డియన్ ఏంజిల్లా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ, కాపాడుతూనే ఉంటావని! నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళతావని ప్రతిరోజూ ఎదరుచూస్తూనే ఉన్నాను. అన్నిచోట్లా వెతుకున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. నా జీవితంలో నెలకొని ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది. – రియా చక్రవర్తి మన లుక్‌టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులం మనమని అనుకున్నాను. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరమవ్వడాన్ని నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావనే అనుకుంటున్నాను. – కృతీసనన్ -
ఆరోగ్యంగా ఉందాం
‘అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటించాలనే లక్ష్యంతో ‘యువర్‌లైఫ్.కో.ఇన్’ వెబ్‌సైట్‌ను స్థాపించాను’ అన్నారు ఉపాసన కొణిదెల. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత పేరును ప్రకటించారు ఉపాసన కొణిదెల. ఈ విషయం గురించి ఉపాసన మాట్లాడుతూ – ‘‘ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక మరియు భావోద్వేగాల సమతుల్యత వంటివి నేను నమ్మే సిద్ధాంతాలు. ఇవన్నీ అందరికీ చేరువ చేయాలని ఈ వెబ్సైట్ స్థాపించాను. ఇలాంటి ఆలోచనలే సమంత కూడా పాటిస్తున్నారు. స్వయంకృషితో ఎదిగిన సమంత ఆలోచనలు, సూచనలు మా పాఠకులకు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నాం’’ అన్నారు ఉపాసన. ‘‘జస్ట్ అలా కూర్చుని ఉంటే పర్ఫెక్ట్ కాలేం. లేవండి.. కదలండి.. ఫిట్ అవ్వండి’’ అన్నారు సమంత. -
వెబ్ సైట్, యాప్‌తో రజనీ ఆహ్వానం
-
రండి.. నాతో చేతులు కలపండి
సాక్షి, చెన్నై : రాజకీయ ఆరంగ్రేటం గురించి ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేత్ర స్థాయి పనులను ప్రారంభించేశాడు. వెబ్ సైట్, యాప్‌ను లాంఛ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆహ్వానం కూడా పంపాడు. ఈ మేరకు రజనీమండ్రమ్.ఓఆర్జీ పేరుతో ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించి అందులో రజనీ ప్రసంగం వీడియోను ఉంచారు. తన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించిన అభిమానులను ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంచి మార్పు కోసం ఫ్యాన్స్, తమిళ ప్రజలు ఏకతాటిపైకి రావాలని. పార్టీలో వాలంటరీలుగా చేరాలని ఆయన పిలుపునిచ్చాడు. రజనీ మండ్రమ్ పేరుతోనే యాప్‌ను కూడా లాంఛ్ చేశారు. అన్నీ బాగానే ఉన్నా పార్టీ పేరును ప్రకటించకుండానే ఈ హడావుడి చేస్తుండటం కొసమెరుపు. కాగా, సుమంత్ రామన్ అనే రాజకీయ విశ్లేషకుడు రజనీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ.. అవసరమైతే రజనీకి సలహాలు ఇస్తానని ముందుకు రావటం విశేషం. -
అమిత్ షా అధికారిక వెబ్ సైట్ ప్రారంభం
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారిక వెబ్ సైట్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ అధికారికంగా అమిత్ షా వెబ్ సైట్ (www.amitshah.co.in)ను ప్రారంభించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తాను అందుకుంటానని, మీడియాతో చాలా తక్కువగా కలుస్తుంటానని షా పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాలతో పాటు తన వ్యక్తిగత కార్యచరణ వివరాలు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దీంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.