
అమిత్ షా అధికారిక వెబ్ సైట్ ప్రారంభం
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారిక వెబ్ సైట్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ అధికారికంగా అమిత్ షా వెబ్ సైట్ (www.amitshah.co.in)ను ప్రారంభించారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు తాను అందుకుంటానని, మీడియాతో చాలా తక్కువగా కలుస్తుంటానని షా పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాలతో పాటు తన వ్యక్తిగత కార్యచరణ వివరాలు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దీంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.