వైరలవుతున్న రామ్‌చరణ్‌- ఉపాసన ఫోటో | Upasana Shares Her Romantic Pic With Ram Charan | Sakshi
Sakshi News home page

వైరలవుతున్న రామ్‌చరణ్‌- ఉపాసన రొమాంటిక్‌ ఫోటో

Published Thu, Mar 25 2021 4:54 PM | Last Updated on Fri, Mar 26 2021 8:40 AM

Upasana Shares Her Romantic Pic With Ram Charan - Sakshi

ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా అందిరికి సుపరిచితురాలే. అంతేగాక అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

కాగా కొన్నేళ్లు ప్రేమించుకన్న రామ్‌ చరణ్‌, ఉపాసన.. 2012 జూన్‌ 14లో వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. అప్పటి నుంచి కొణిదెల కుటుంబంతోనూ ఆమె మమేకైపోయింది. సోషల్‌ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్‌ ఇస్తుంటారు. తాజాగా రామ్ చరణ్‌తో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

అయితే ఇది పెళ్లికి ముందు దిగిన ఫోటోలా కనిపిసిస్తోంది. ఇందులో చెర్రీ, ఉపాసన ఇద్దరూ కలిసి ఓ బైక్ దగ్గర నిల్చున్న ఫోటో. గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, 'హ్యాపీ పీపుల్... తమ జీవితాల్లోని హ్యాపీనెస్ పట్ల ఆకర్షితులవుతుంటారు. నేనూ దీనిని పూర్తిగా నమ్ముతాను. త్రోబ్యాక్‌' అంటూ ఫోటోకు కాప్షన్ ఇచ్చారు. ఈ పిక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రామ్ చరణ్‌ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఉపాసన ఈ పాత ఫోటోను పోస్ట్ చేయడం మరింతగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో ఎప్పుడు తీసుకున్నారని చాలా క్యూట్‌గా ఉన్నారని కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: రామ్‌చరణ్‌ బర్త్‌డే సీడీపీ: ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌!
‘జాతిరత్నాలు సినిమాను నిషేధించాలి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement