విజయ్‌సేతుపతి ప్రాజెక్ట్‌లో నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ హీరోయిన్‌ | Vijay Sethupathi And Nityameenan Movie Plan | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతి ప్రాజెక్ట్‌లో నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ హీరోయిన్‌

Published Sat, Aug 24 2024 7:03 PM | Last Updated on Sat, Aug 24 2024 7:17 PM

Vijay Sethupathi And Nityameenan Movie Plan

కోలీవుడ్‌ హీరో విజయ్‌సేతుపతి నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా నిత్యామీనన్‌ ఇంతకుముందు తను నటించిన 'తిరుచ్చిట్రంఫలం' తెలుగులో 'తిరు' చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అలాంటి వీరి కాంబినేషన్‌లో చిత్రం అంటే భారీ అంచనాలు నెలకొంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

ఇద్దరూ కూడా కథలో ప్రాధాన్యత ఉంటేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే నటులే.. అలాంటి క్రేజీ కాంబోలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌ ఒక  చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌ కథ, దర్శకత్వం వహించనున్నారు. 1950 నుంచి ఎంజీఆర్, శివాజీగణేశన్, రజనీకాంత్, కమలహాసన్, అజిత్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌తో దర్శకుడు పాండిరాజ్, విజయ్‌సేతుపతి కొలాబ్రేట్‌ కావడం విశేషం. 

కథకు ప్రాముఖ్యతనిస్తూ ఆరు నుంచి అరవై ఏళ్ల వారిని అలరించేలా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్న నిత్యామీనన్‌ నాయకిగా నటించడం మరో విశేషం అని చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌లో నిత్యామీనన్‌ త్వరలో పాల్గొంటారని పేర్కొన్నాయి. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్వాహకులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement