Adivi Sesh Birthday Special: Open Up on His Marriage, Personal Life - Sakshi
Sakshi News home page

Adivi Sesh: మనసులో మాట బయటపెట్టిన యంగ్‌ హీరో.. పెళ్లిపై క్లారిటీ

Published Sat, Dec 18 2021 12:38 PM | Last Updated on Sat, Dec 18 2021 2:04 PM

Young Hero Adivi Sesh Open Up About His Marriage On Birthday - Sakshi

Adivi Sesh Open Up On His Marriage In A Interview: యంగ్‌ హీరో అడవి శేష్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేలా కనిపిస్తున్నాడు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోని మాటను బయటక పెట్టాడు ఈ యంగ్‌ హీరో. కాగా నిన్న(డిసెంబర్‌ 17) అడవి శేష్‌ బర్త్‌డే. దీంతో ఆయన  36వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అడవి శేష్‌ తన వ్యక్తిగత విషయాలను గురించి పంచుకున్నాడు.

చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి పుష్ప మూవీ

ఈ క్రమంంలో తన పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. ‘మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కొన్నాళ్లు గట్టిగా చెప్పారు.. ఆ తరువాత తిట్టారు. ఇక. ఇక వీడికి చెప్పడం మన వల్ల కాదనుకుని వదిలేశారు. కానీ ఈ మధ్యనే నాకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపిస్తోంది. అంటే ఒక రకంగా పెళ్లి మీదకి గాలి మళ్లిందనే చెప్పాలి’ అంటూ నవ్వుతూ అన్నాడు. అయితే ఇటీవల అతడి పెళ్లి అంటూ రూమార్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఈ యంగ్‌ హీరో ఇలా హింట్‌ ఇచ్చాడంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: పుష్ప మూవీకి భారీ షాక్‌, ఆందోళనలో దర్శక-నిర్మాతలు

ఇక అడవి శేష్‌ తాజాగా నటించిన చిత్రం మేజర్‌ ఫిబ్రవరి 11వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ‘మేజర్’ తప్పకుండా హిట్ అవుతుందని అతడు థీమా వ్యక్తం చేశాడు. కాగా మొదటి నుంచి అడవి శేషు విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు నటించిన క్షణం, గుఢాచారి, ఎవరు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా నటించిన మేజర్‌ రిలీజ్‌కు రెడీ కాగా.. రీసెంట్‌గా నాని నిర్మాణంలో అడవి శేష్‌ హీరోగా వస్తోన్న ‘హిట్‌ 2’ సెట్స్‌పైకి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement